అలా అలా అలలాగ ఎగసిపడుతు సాగనా?
కరగని నీ కనులముందు
కన్నీరుగ మారనా?
ప్రేమించడం నేరమనీ
చెప్తున్నారెందుకందరూ---
మరి అన్ని కధలు ఎనెన్నో కవితలు
నోరూరించే నవలలు ఇప్పుడొస్తున్న చలన చిత్రాలు
అన్నింటినీ సృష్టించినవారుకూడా ద్రోహులకోవకిందే వస్తారుగా
మరి ఈ ప్రేమికులకే ఎందుకుట ఈ వల్లమాలిన శిక్షా స్మృతుల అడ్డంకి?
ఉగ్రవాదాన్ని ప్రేమిస్తే భుజాలకెత్తుకుని ఊరేగిస్తున్నారు!
ప్రక్కదేశాలను పొగడ్తలతో ముంచెత్తుతూ
నెత్తికెత్తుకుంటే ప్రయోజకుడిగా చూస్తున్నారు!!
స్వంత దేశాన్ని ప్రేమిస్తుంటే వేరేగా చిత్రిస్తున్నారు.
అసలు ప్రేమంటే నికార్సయిన నిర్వచనమేమిటో
ఎవరన్నా చెబితేబావుండు.
అమ్మాయిలను హత్తుకోలేదు--అమ్మను
తృణీకరించలేదు పుట్టిన దేశం నెలపైన
పేరుకున్న మట్టిని కళ్ళకద్దుకుంటుంటే
ఈ మాధ్యమాల కెందుకింత కంటగింపు?
-------------------------------------------

No comments:
Post a Comment