నవనవోన్మేషం----
==========================
రాలిపడిన జీర్ణపత్రాల్లోనూ
ఎంత జీవకళ వుట్టిపడుతుందో
రామణీయకతకు రెండో పార్శ్వం
బహుశా ఇదే కావచ్చునేమో కూడా--
నిన్నటిదాకా అందరి హృదయ కమలాలనూ
దోచుకున్న సుమనోహర స్వర్ణ పతకాలివేగదా?
ఆ దృశ్యాలతో నిండిపోయిన నా మనసు
ఖేదానికి తావివ్వనని తేల్చి చెప్పేసింది..
జల ప్రవాహపు సందడిలో క్రిందకు పడిన
ప్రతి కెరటమూ పునరుద్ధరించడం
చూసిన కనులుగదా ఇవి--
మ్రోడువారిన తరువులన్నీ మళ్ళీ చివురు
జొంపాలతో తొణికిసలాడుతాయని
ప్రగాఢంగా విశ్వసించిన నాకు
ఆపరిణామక్రియ జరుగుతుందనడంలో
ఇసుమంతయినా సందేహంససేమిరా లేదు---
ప్రతిరుతువూ వసంతమై ప్రభవిల్లలేకపోయీనా
శిశిరజ్యోత్స్నలుకూడా జీవనయానంలో భాగమేనని
బొమ్మా బొరుసులతో కళ కళలాడే నాణ్యం మనకు
సోదాహరణంగా ప్రవచించడం చూస్తున్నాం కదా!!
అమూల్యమైన జీవన యానపు అసలు రహస్యం
అదేనని గ్రహించగలిగినప్పుడు--ఆనందమెజీవనదిలా
శోభిల్ల డం మనకు కొత్తెలా అవుతుంది?
ననవోన్మేషంగా విరాజిల్లడం వెలుగు దారులవెంట
వడి వడిగా కదలడమేనంటే ఎవరు కాదనగలరు?
==========================
రాలిపడిన జీర్ణపత్రాల్లోనూ
ఎంత జీవకళ వుట్టిపడుతుందో
రామణీయకతకు రెండో పార్శ్వం
బహుశా ఇదే కావచ్చునేమో కూడా--
నిన్నటిదాకా అందరి హృదయ కమలాలనూ
దోచుకున్న సుమనోహర స్వర్ణ పతకాలివేగదా?
ఆ దృశ్యాలతో నిండిపోయిన నా మనసు
ఖేదానికి తావివ్వనని తేల్చి చెప్పేసింది..
జల ప్రవాహపు సందడిలో క్రిందకు పడిన
ప్రతి కెరటమూ పునరుద్ధరించడం
చూసిన కనులుగదా ఇవి--
మ్రోడువారిన తరువులన్నీ మళ్ళీ చివురు
జొంపాలతో తొణికిసలాడుతాయని
ప్రగాఢంగా విశ్వసించిన నాకు
ఆపరిణామక్రియ జరుగుతుందనడంలో
ఇసుమంతయినా సందేహంససేమిరా లేదు---
ప్రతిరుతువూ వసంతమై ప్రభవిల్లలేకపోయీనా
శిశిరజ్యోత్స్నలుకూడా జీవనయానంలో భాగమేనని
బొమ్మా బొరుసులతో కళ కళలాడే నాణ్యం మనకు
సోదాహరణంగా ప్రవచించడం చూస్తున్నాం కదా!!
అమూల్యమైన జీవన యానపు అసలు రహస్యం
అదేనని గ్రహించగలిగినప్పుడు--ఆనందమెజీవనదిలా
శోభిల్ల డం మనకు కొత్తెలా అవుతుంది?
ననవోన్మేషంగా విరాజిల్లడం వెలుగు దారులవెంట
వడి వడిగా కదలడమేనంటే ఎవరు కాదనగలరు?