Thursday, April 7, 2016

జతపరచని హామీ పత్రం
---------------------------------
నిన్ను అమితంగా ప్రేమించినదెవరు?
నిన్ను ప్రాణప్రదంగా అభిమానించినదెవరు?
అనవరతం నీ ఊహల్లో ఊసుల్లో
ఆత్మీయతను కనబరచిందెవరు?
అందరూ విరామ దిశగా చూపులు సారిస్తే
అధిక శ్రమకోర్చియైనా
నీ నవ్వులపువ్వులను నవరత్నాలుగా
భావించి భద్రoగా గుండె కుహరాల్లో దాచుకున్నదెవరు?

ఈ జన్మకీ సుఖం చాలుననుకుంటూ
నిరంతరం పరవశించిన ప్రేమఖైదీ ఎవరు?

ఆపుణ్యాత్ముడెవరో తెలుసుకోవలన్న కుతూహలం నీకుంటే
రా నాదగ్గరకు వచ్చి ఈ వదనముకురంలోకి తొంగిచూడు.

ఎవరే అతగాడని?
ఆమన్మధాకారుడిని నేనేనని
నీకు ఇట్టే అవగతమౌతుందని అక్షరాలా హామీ!
*******************************************************

No comments:

Post a Comment