వర్షం కురిసిన రాత్రి
--------------------అను: రావెల
్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్
శూలాల్లా పొడుచుకుంటూ వచ్చిన గాలి
నా ఇంటి కిటికీ తెరలను చీల్చి చెండాడ్తున్నాయ్.
చల్లటి రాత్రి వేళ వాన దబాటుగా కురుస్తూ
పరిసరాలన్నింటినీ భజంత్రీల్లా మోగిస్తూ భయ పెడుతున్నాయ్..
ఈ అనాలోచితమూ, అనూహ్యంగా విచ్చేసిన వాన జబురుకు
నిద్ర నాకు దూరంగా జరిగి నిష్క్రమించింది..
ఏమిటో కడుపంతా పట్టేసినట్లనిపిస్తుంది..
కన్నీళ్ళు ధారాపాతంగా ప్రవహిస్తూనే వున్నాయి..
వెదురు తరువులు వేదనాభరితంగా శిశిరపు తరువుల్లా రోదిస్తున్నాయి..
ఇంటిపైన పరచబడ్డ పెంకులన్నింటినీ వాన అభిషిక్తులను చేస్తున్నది..
చలికేమో రాత్రంటా గడ్డకట్టుకున్న అనుభూతి..
చీకట్లో ఒంటరిగా నేను నిశ్శబ్దాన్ని గట్టిగా కౌగిలించుకోక తప్పింది కాదు--
బాధలన్నీ సహస్రాలై గుండెను చెరువు చేయడంలో నిమగ్నమయ్యాయి..
ఏ క్షణంలోనయినా గుండె వ్రయ్యలై పోతుందేమోనన్న భయ భ్రాంతులు..
వెదురు ఆకులేమో సుడులు తొరుగుతూన్న అనుభూతి..
నా కడుపులో ఎందుకో సురాలెత్తుతున్న అనుభవం..
ఈ వేదనాభరితమైన క్షణాలనుంచి బయటపడడమెలా?
బయట విసురుగా వీస్తున్న గాలి దిశను మార్చుకున్న వైనం..
లేత అరిటాకులమీదకు ఒంటికాలుతో దండయాత్ర చేసినట్లున్నది..
కిటికీలోంచి జరుగుతున్న భీభత్సాన్నంతటినీ నేను గమనిస్తున్నాను..
ప్రతి లేజివురుటాకూ తన బాధామయ గాధను ఎదుటి ప్రపంచానికి
ఏకరువు పెడుతున్న తీరు దయనీయమై దర్శనమిస్తున్నది..
[------ చైనీస్ కవయిత్రి [ 1135-80 ] chu shu chen కవితకు అనుసరణ...... ]

No comments:
Post a Comment