సూర్యచంద్రుల సాక్షిగా
------------------------------రావెల.
చూపుడువేలుకు చుట్టరికాల వూసు తెలిసినట్టున్నది
ఉడికిస్తున్న భానుడిమీద ఉగ్రవాద దాడిచేసి మురిసింది..
చందమామ ఇంకా చల్లబడడంలేదని
అందలమెక్కి తారలతో కులికే అతగాడిని
అనరాని మాటలు వదరి అవమానభరుణ్ణి గావించింది..
ఏం సహకరించ లేదని మా హక్కులను పరిహరించి పారేసారు..
నదీ నదాలను మళ్ళించి వట్టిపోయేలా ప్రణాలికలు రూపొందించారు..
భూగర్భ జలాలనన్నింటినీ చల్లటిపానీయాలు తయారుచేసే
విదేశీ కంపెనీలకమ్ముకుంటూ ఊటలను నిస్సంతులుగా మార్చేసారు..
చెట్లన్నింటినీ దారుణంగా కొట్టిపడేసి ఆకాశహర్మ్యాలనీ
రహదారి విస్తరణకోసమనీ మమ్మల్ను తలదాచుకునే
గూడులేకుండా నిరాశ్రయులను చేయాలని కంకణం కట్టుకున్నారు.
అందుకే ఇలా అనూహ్యమైన హెచ్చు ఉష్ణోగ్రత్తలతో మిమ్మల్ను తీవ్రంగా హెచ్చరిస్తున్నాం..
మీ కుట్రలూ కుతంత్రాలనూ ఇకనైనా మానండి.. మనిషి మనిషిగా మంచి మనసుతో బ్రదికే మార్గాలకోసం అన్వేషించండి..మీ ప్రయత్నాలమీద మాకు నమ్మకంకుదిరితే మాలోమేము మాట్లాడుకుని
మీకు హితైషులుగా మారతాం..లేదా ఇలానే మీరు నేలమీదే నరకాన్ననుభవిస్తూ నిర్జన మవ్వడం ఖాయమని హెచ్చరిస్తున్నాం..
ఈ సిమెంట్ అరణ్యాలతో మమ్మల్ను నిరాశ్రయులను చేసిమురిసారు..
ఇంకెందుకు మీ సుఖ శాంతులకోసం మేము పాటుపడాలి?
-------------------------------------------------------------------------
No comments:
Post a Comment