Sunday, April 3, 2016

కొన్ని చైనీస్ కవితలకు
అనుసరణలు
===================

చందమామను
ధనంతో లోబర్చుకుందాం
రాత్రినలాగే దీర్ఘంగా
 మిగుల్చుకునేందుకు ప్రయత్నిద్దాం..


-----
మనం కలలోనేకలుసుకోవడమే
మేలని పిస్తుంది--
మెలకువ వచ్చినప్పుడల్లా
నీకోసం వెదకడంలోనే ఏదో
తెలియని హాయున్నదనిపిస్తున్నది..
------
ఎవరోతలుపు తడితే
మెల్లగా వెళ్ళి తలుపు తీసాను..
ఇంటిముందు తోటలోకి
చందమామ దిగొచ్చి పచారుచేస్తూ
కనిపించి ఆశ్చర్య పరిచాడు..

======
ప్రియా నేను కాలగతినే మర్చిపోయాను..
ఈ రుతువేమిటో చెప్పగలవా?
కన్నులెదుట నీవుంటే అంతటా
వసంతమే ఒడలు విరుచుకుని
కనిపిస్తుంది, నాకు
------------------
మనిద్దరిమధ్యనా అనుబంధాన్ని
దేనితోపోల్చగలనో చెప్పు..
ప్రభాత సమయానికే ప్రయాణం
మొదలెట్టే పడవతోనా?-----

No comments:

Post a Comment