మావూరు పేరు వినగానే ఠక్కున గుర్తుకొచ్చేది
కిష్టయ్యగారు.పేరుకు గుడిపూడి రామకృష్ణయ్యే
అయినా అందరికీ పరిచయమైన పేరు కిష్టయ్యగారు.
ధనుర్మాసంలో దేవుడి చిత్రపటాన్ని పట్టుకుని నడిచేది
మా పిచ్చి సుబ్బాయ్యే అయినా ,వెనుకనుండి వెన్నెముకైనడిపే
నగర సంకీర్తనా చార్యుడు మా కిష్టయ్య గారే.
ఉద్యోగం గ్రామీణ వైద్య శాలలో అనధికారంగా కాంపౌండర్.
దాక్టరుగారికన్నా ఒకరకంగా చెప్పలంటే ఒక పిసరు
సిఫారసు గలిగిన వ్యక్తి ఈయనేనని మనం నిరాటంకంగా
చెప్పుకోవచ్చు.ఊర్లో యే శుభభకార్యమైనా ఆయనకు ఆహ్వానమందకుండా
ఆ కార్యక్రమం జరగదనే చెప్పుకోవాలి.
ఆయనలో భక్తిపారవశ్యం మెండు.రోజూ ఒకరి ఇంట్లో క్రమం తప్పకుండా జ రిగే భజన కార్యక్రమంలో మాకిష్టయ్యగారుపదిసెట్ల తాళాలూ ,కంజీరా, ఢోల క్ ,గజ్జెలతో హాజరవాల్సిందే.
భజన పూర్తవగానే భక్తవరుల్లో ఎవరోఒకరు ఆసంచీని వాళ్ళింట్లో ఆయన చెప్పిన ప్రదేశంలో పెట్టివచ్చేవారు..
ఆయన దగ్గరున్న ఓ అద్భుతమైన కళ సెన్సారు వాడి కత్తెరతీసుకుని దిన,వారపత్రికల్లోని వాక్యాలను తనకనుకూలమైన రీతిలో కత్తిరించి, తలుపు చెక్కకో ఆయన ప్రత్యేకంగా అల్లించుకున్న తడికల గదికో అంటించి ఆనందపడ డం .
ఆయనకు భార్యా వియోగమయినందున వళ్ళ ఇంట్లొ వెధరాలయిన అక్క పెళ్ళి మాటేత్తని తమ్ముడు అప్పయ్యా ఉండేవారు.కూతురు పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళింది అప్పుడప్పుడూ చుట్టపు చూపుగా వవ్చి వెళ్ళేది.ఆయన కత్తిరింపుల కళాకౌశలం లో కొన్ని ఉదాహరణలు.
మైసూరులో దసరా ఉత్సవాలు
గుంటూరులో సత్యహరిశ్చంద్ర నాటకం
అదికాస్తా గుంటూరులో ఘనంగా దసరా ఉత్సవాలు
మైసూరులో సత్య హరిశ్చంద్రనాటక వైభవం.
అయి అందరినీ అలరించేవి.అదీ రాంకకృష్ణయ్యగారి ప్రతిభా ప్రభ. ఇలా ఇల్లంత కత్తిరింపులూ అతికింపులే.
వాళ్ళక్క మాలక్షమ్మ గారినడిగితే ఆ మొదరొష్టపోడున్నాడుగా పనా ! పాటా!! అన్నంతిని కూచ్చొని ఇలాంటి నిర్వాకమేదో చేస్తుంటా రు..
ఇక తమ్ముడు అప్పయ్యగారు ఎక్కువగా నులకమంచం అల్లుతూ[అదొకనిష్టగ చేయవలసిన కార్యక్రమము] గోగునారని చీల్చి ఎం డబెట్టీ నారను పేనుతుంటాడు.ఆయన ప్రత్యేకత యేo టoటే
గోంగూర పులుసుకూరకూ గోంగూర నూరిన పచ్చళ్ళకు రుచికరంగా తిరగమోతలు పెట్టీవ్వడం .ఉదయం పదిగంటలకల్లా సిబ్బిరేకులగినెలతోనో
రాచిప్పలతోనో జనం తయారు.తిరగ మోతలు పెట్టించుకోడానికి.
ఈ కధాకమామిషును మాకిస్టయ్యగారి
అక్రూరవరద గోవిందతో మొదలెట్టి , సమస్త హరిదాసులకూ జై అనేద్దాం.
===================================================

No comments:
Post a Comment