గ్రహణం విడువని సూరీడు
-----------------------------రావెల
దివినుండి భువికి జారిపడ్డ అమృతకలశంలా రూపందాల్చిన
గతేడాది ఉగాది..కోరికల తరువుమీద చిటారుకొమ్మమీదనుంచి
మిఠాయిపొట్లాన్ని ఒక వరుమానంలా , నేలకు రాల్చి క్రిందకు పడేసింది..
విశ్వ విద్యాలయాలను వేదికగా చేసుకుని , చదువులతల్లిమీద సంస్కార హీనంగా ప్రవర్తించింది..
ప్రేమకు ప్రతిఫలం వంచింపబడడమేనని వాస్తవ స్తవంగా నిరూపించింది..
ఇంకా ఏంచేసి యేం బావుకుందామని ఇలా, ఈ ఏడూ విచ్చేసింది?
నవ్వులను జనావళికి దూరంగా విసిరేసి నవ్వుకుంది.
ఆరురుచులలోనూ వగరుకూ , చేదుకూ అగ్రసనాధిపత్యమిచ్చి మురుసుకుంది..
దుర్మార్గమే సరయిన మార్గమని పదే పదే వల్లించి వెళ్ళింది..
మంచితనాన్ని మారాకు వేయకుండా కొనగోటితో తుంచేసింది..
కులానికీ ,మతానికీ కొప్పులు ముడివేసి తన్నుకు చావండని
తరుముకుంటూ వెళ్ళిపోయింది, తరచుగా వస్తుంటానని మరీ భయపెట్టింది..
మందుపాతర్లకన్నా ఎక్కువగా ప్రాణహానికలిగించే, నల్ల ధనం పాతర్లను
పనామా పేపర్సులోనూ, స్విస్ బాంకుల్లోనూ కనబడకుండా భద్రంగా దాచేసి
ఏమీ తెలియని నంగనాచిలా తుంగ బుర్రలా నాట్యం చేసుకుంటూ
జనాల హృదయ పీఠులపై నర్తించడానికి విచ్చేసింది..
ఇలా చెప్పుకుంటూ పోతే వందలూ వేలూ తప్పులుచేసి తిప్పలు పెట్టింది..
తగుదునమ్మా అంటూ కాగితాల దొంతర్లతో కవిసమ్మేళనానికిలా
కొత్తదిరుసులను సర్దుకుంటూ, కళ్ళెగరేస్తూ విచ్చేసింది..
నిలబెట్టుకోలేని నేతల వాగ్దానికీ, దీనికీ ఏదో
అవినాభవసంబంధముండే వుంటుంది.. ఇలా వేధించుకు తినేందుకే
ఇదే సరయిన సమయమని వింతగా వచ్చేసింది..
అమ్మా ఉగాది సుందరీ !! ఈసారయినా నీ ముఖాన్ని అద్దంలోచూసుకుని రా!!
సత్య హరిశ్చంద్రుడి పేరిటమాత్రం యికపై అబద్ధాలు వల్లించకు
సుభాషిణి ని నేనంటూ మూగబాసలు చేసి మురుసుకోకు..
గాదే నిండా ధాన్యం నింపుకునే రోజులు గతించి పోయాయమ్మా!!
ఏపూటకాపూట గడిస్తే చాలనుకునే దీనావస్థలో బ్రదుకునీడుస్తున్నాం..
గ్రహణం పట్టి, పగబట్టిన సూర్యుడినీ, చెరబట్టబడ్డ చంద్రుడినీ
ఎప్పుడోగాని చూడని మేమునీ ధర్మమా అంటూ గ్రహణం పొగదట్టంగా
చూరి మకిల బారుతున్న దేశాన్ని ప్రతినిత్యం చూస్తున్నాం..
అందోళనలూ ఆక్రందనలూ నిత్యకృత్యమైన భూగోళంలో దైనందినం
భయం గుప్పిట్లో రోజులు లెక్కించుకుంటూ బ్రదుకులను వెళ్ళదీస్తున్నాం..
ఇదీ మా ఆత్మల కధ.. క్షోభిస్తున్న మా అంతరంగాల కధనం.
మన్నించుతల్లీ!! మరలా నొప్పించడానికి మాత్రం దయచేసి మా చెంతకు చేరకు..!!!
===================================================================

No comments:
Post a Comment