ఆకాంక్షారోచిస్సులో-------
------------------------రావెల
కొమ్మమీద కోయిలమ్మ కొత్తపాట పాడనంది
పాతపదం పాడుకుంటు పరవశించిపోతున్నది..
చదువులలో కొత్తదనం చివరంటాలేదన్నది.
చదువును కొనే వారి అడుగులకు మడుగులొత్తుతూ ,
చదువుకునే వారికే చాప చుట్టడమేంటని? ప్రశ్నిస్తున్నది
అమ్మతనపు కమ్మ దనం అరుదై పోతున్నది
పల్లెలోన పంటపొలం పూర్తిగామృగ్యమౌతున్నది.
పరమేశా!! గంగ విడుమని ప్రతిపట్నం ఘోషిస్తున్నది.
మానినుల మానం కాపాడమని ప్రతి తరుణీ కాంక్షిస్తున్నది..
ముఖం ఎలా ఏడిస్తేనేం !! మంచి మనసుంటే చాలన్నది
కాలుష్యం బారినపడిన ప్రాణాలన్నీ హరిస్తున్నవి..
కార్పొరేట్ సంస్కృతిలో కరుణకు చోటు లేదన్నది..
మనిషి మనిషిగ బ్రదికే మార్గమే మేలన్నది..
కొమ్మమీద కోయిలమ్మ కొత్త పాట పాడనంది
పాతపదం పాడుకుంటు పరవశించిపోతున్నది..
"గతకాలము మేలు వచ్చుకాలముకంటెన్" అన్న వాక్యమునే
పదేపదే వల్లిస్తూ శాంతిమంత్రం జపిస్తున్నది..
కవిసమ్మేళనాలలో కంఠం విప్పనని మొరాయిస్తున్నది..
చెప్పిందే చెప్పడమెందుకని? చెవిదగ్గరశంఖం మోగిస్తున్నది..
అందరూ బాగుండాలన్న ఆశయమే తనదంటూ
ప్రతి ప్రాణికీ నవజీవనమె అనవరతం కాంక్షిస్తూ, సెలవని చిత్తగించింది ..
===============================================

No comments:
Post a Comment