Sunday, April 10, 2016

కవీనాం
----------------రావెల.
అందరూ కవిత్వాన్ని వెలయిస్తారు..
అనుభవెకవెద్యమైన ప్రతిభావ్యుత్పత్తులతో
అందరినీ ఇట్టే ఆకర్షిస్తుంటారు..

పూలబాసలను తెలియజేసేటప్పుడూ,
పండువెన్నలను కనుల విందుగా ఆరగించేతప్పుడూ
ప్రణయగీతికల్లో భావాలను ప్రకటించేటప్పుడూ
పరవశించిపోతూ పదాల అల్లికలో మునిగితెలుతూ వుంటారు..

శ్రీనివాసులను కీర్తించడమంటే కొందరు నిష్ణాతులా
ప్రగల్భాలతో ముంచెత్తుతూ స్వకపోలకల్పనలతో రాణిస్తారు..

అధోజగత్సహోదరుల ఆక్రందనలను ఆలకించమంటే ఆముదం ముఖంవేసుకుని జిడ్డోడుతూ నిష్క్రమిస్తుంటారు..


ఏదేమయినా కవిత్వమంటే ఒక అలజడి..
 వానచినుకుల పులకరింత
జడివాన హొరుగాలుల జలదరింపు..
కరుణరసాశ్రయమై విలసిల్లే కావ్య ప్రయోజనం..
ఆనందోపదేశాల మేలుకలయిక--
మంగళకరమైన ముక్తాయింపు,,
సురుచిర ,సుమధుర సమ్మేళనాల మేళవింపు కూడాను..
===============================================



No comments:

Post a Comment