ఇక వసంతం వచ్చేసిందిగదా!!
మనం గత రుతువుల్లో మొదలెట్టిన
కక్షలను,కావేషాలనూ
క్రమేపీ మర్చిపోయే ప్రయత్నం చేద్దాం..
ఇక పైనమన జీవితాలను కొత్తదారుల్లో
నడిచేలా ప్రయత్నాలు ప్రారంభిద్దాం..
అసలెందుకు ఈ జీవరాసులన్నీ ఇలా
మనుష్య జాతిని ద్వేషించడం మొదలెట్టాయ్..?
పూలన్నీ ఇలా మనల్ను వంచించడం ప్రారంభించాయి?
కానీ ఈపూలచెట్లు మాత్రం తలలువంచి
వినయ విధేయతలు ప్రకటిస్తున్నాయ్!
కన్నీటి చాలులు ధారాపాతంగా స్రవిస్తూ,
బుగ్గలమీద కారుతూ ఆ ఎరుపుదనాన్ని
వర్ణ రహితం గావిస్తున్నాయ్--
వసంతంలో వచ్చే మూడో పున్నమి నాటికైనా
నేను అవరోధంగా మిగలకూడదని భావిస్తుంటాను..
[ఒక చైనీస్ కవితకు అనుసరణ---]
మనం గత రుతువుల్లో మొదలెట్టిన
కక్షలను,కావేషాలనూ
క్రమేపీ మర్చిపోయే ప్రయత్నం చేద్దాం..
ఇక పైనమన జీవితాలను కొత్తదారుల్లో
నడిచేలా ప్రయత్నాలు ప్రారంభిద్దాం..
అసలెందుకు ఈ జీవరాసులన్నీ ఇలా
మనుష్య జాతిని ద్వేషించడం మొదలెట్టాయ్..?
పూలన్నీ ఇలా మనల్ను వంచించడం ప్రారంభించాయి?
కానీ ఈపూలచెట్లు మాత్రం తలలువంచి
వినయ విధేయతలు ప్రకటిస్తున్నాయ్!
కన్నీటి చాలులు ధారాపాతంగా స్రవిస్తూ,
బుగ్గలమీద కారుతూ ఆ ఎరుపుదనాన్ని
వర్ణ రహితం గావిస్తున్నాయ్--
వసంతంలో వచ్చే మూడో పున్నమి నాటికైనా
నేను అవరోధంగా మిగలకూడదని భావిస్తుంటాను..
[ఒక చైనీస్ కవితకు అనుసరణ---]
No comments:
Post a Comment