చంద్రోత్సవం--
==============
శిశిర రుతువు ఆగమానికి
స్వాగతతోరణాలు కట్టడం పూర్తయింది..
పగలబడి విచ్చుకుంటున్న వెన్నెలంతా
జనగణం మీద విస్తారంగా
పరుచుకు పోవడానికి సంసిద్ధమయింది.
అప్పుడే చందమామ నదీ తలంపై శరవేగంగా
స్వారీ చేయడం మొదలెట్టింది--
అలా ఈతగొడుతూ మునిగిపోయే అవకాశం లేదుకదా!!
చందమామలో అందంగా నిదురించే కుందేలు పిల్ల
జీవిత గమనంలోని చేదునంతటినీ పొడగట్టి
చూర్ణంగా చితగ్గొట్టడమూ మొదలయింది..
ఈ చేదు కషాయపు పొగలు నా హృదయ కుహరాల్లోకి
చొచ్చుకుపోయి నన్ను కళవళ పెట్టవుగదా!!
అతగాడి స్వేతపర్ణపు జ్యోత్స్న నా శిరోజాలను
తెల్లబరచడం చేస్తున్నదేమోనని నా సందేహం--
నాకు తెలుసు సమరాంగణంగా మారిపోయిన జగత్తును
ఈ వెన్నెలంతా కుప్పబోసినట్లయి ఉలికిపాటుకు గురిచేయడం ఖాయమని..
దేశంలో శాంతి భద్రతలను కాపాడుతూ సరిహద్దులచెంత కాపలా గాసే
ఆ సైన్యానికి ఈ వెన్నెల కర్ప్పొరపు అంద చందాలను ఆస్వాదించే
యోగం లేకుండా చేస్తున్న ఈ రాచరికం ఎంత క్రూరమైందో ఇట్టే
అవగతమై పోతూ హేయ భావాన్ని కలిగించడం లేదూ----
[ 710-770 లమధ్య జీవించిన చీనా కవి Tu Fu రచనకు స్వేఛ్చానువాదం--]
======================================================

No comments:
Post a Comment