Tuesday, April 5, 2016

అవసాన దశలో--[అనువాదం]-
                         
--------------------------రావెల

వసంతం వచ్చేసిందన్నా సరే
నా దిగాలుముఖం నాకే
 వెగటు పుట్టిస్తూ వుంటుంది..
రాత్రి సమయాలన్నీ కురచనౌతాయన్న
తృప్తి ఒక్కటే నాలో మిగిలి సందడిచేస్తూ వుంటుంది..

ఇంట్లో వెలుగుతున్న ఆముదం దీపం చుట్టూ
మిణుగురులు ఎగిరెగిరి పడుతూ
ఎకసక్కేలాడుకుంటూ వుంటాయి.
కన్నీళ్ళన్నీ ఎండిపోయి
ఎడారులను పోలి వుంటున్నాయి--
నడుం దగ్గరనుండీ క్రింద భాగమంతా
ఎక్కడో ఒక చో ట కూలబడమంటున్నది--

ఒక్కోసారిఎన్నో ఆలోచనలు మెదడులో ముసురుకుంటుంటాయి..

అవన్నీ ఒక కొసకొచ్చేసరికి ఒకటి గుర్తుంటే పది మర్చిపోతుంటాను..

యవ్వనం లోపల వెలుగుతున్నంత కాలం
పుస్తకాల దొంతర్లతో కాలక్షేపమవడం గుర్తుంది..
నాకున్న వ్యసనమల్లా పుస్తకాల పఠనాసక్తే సుమా!!

చదివిన విషయాలను ఆసక్తి కరంగా వుంటే చెప్పుకుని
మురిసిపోవడానికి మొన్నటి దాకా ఆవిడ తో డుండేది..
ఇప్పుడు ఒంటరితనంతోనే నాలో నేనే మాటా మంతీ!!
అప్పుడప్పుడూ నామీద నాకే జాలిపుట్టుకొస్తుంటుంది..
ఒంటరి తనం ఒక శాపమని ఎవరైనా అంటుంటే తల మాత్రం వూపగలుగుతున్నాను...
[ క్ర్రీశ --1007-1072 మధ్యకాలంలో జీవించిన చైనీస్  కవి   కవితకు భావానుసరణ.. .]  2-4-16

No comments:

Post a Comment