చెట్లన్నీ మోడువారి
దిసమొలలతో దయ్యాల్లా
సాక్షాత్కరిస్తూ భయపెడుతున్నాయి..
శిశిరమింత దారుణంగా తరూసమూహం ఒంటిమీద
దుస్తులన్నింటినీ దిగదుడిచివేస్తుందని
ఒక క్షణమైనా ఊహించలేకపోయాను గదా!!
గుండెనిండా పేరుకుపోతున్న నిరాశ..
ఆశలు చివురిస్తాయని ఆ తరువాత సలక్షణంగా
అడుగుబెట్టిన వసంతం కొత్తగా ఆ నగ్నతరువులన్నింటికీ
కొత్త చివురులు తొడుక్కునేలా చేయగా కళ కళగా కనుపిస్తున్నాయ్..
వనమంతా కొంగ్రొత్త రాగాల కోయిలల్లా గొంతులు సరిచేసుకుని
మనోహరమైన గీతాల నాలపిస్తున్నాయి..
=====================================================

No comments:
Post a Comment