మరణానంతరం......
------------------------రావెల
నా నడకదారిలో ఇవ్వాళ ఒకకళేబరాన్ని చూసాను
రహదారి ప్రమాదలో బాగా గాయపడి మృత్యువు పాలైన
ఒక హరిణమని తెలిసి మనసంతా చివుక్కుమనడం మొదలైంది.
దీనంగా పడివున్న ఆమృగ కళేబరం నాకన్నుల్లో
తడిని ఊటలా ఊరేలాచేసింది.
అప్పటికే కొన్ని చీమలు తమకు ఆరోజుకు ఆహారందొరికిందన్న
ఆనందంతో అక్కడ స్వైర విహారం చేయడం కనబడి ఆశ్చర్యంవేసింది..
వీటినన్నింటినీ పర్యవేక్షిస్తున్న ధోరణిలో కొన్ని దూడ బోతులూ
మరికొన్ని రాబందులూ రెక్కలను చప్పుడు చేస్తూ తమవంతు వాటాకోసం
అక్కడే వాలిపోయాయి.. ఆ దృశ్యంజుగుప్స కలిగించేదయినా ఆక్షణంలో
నాకు యేవిధమైన జుగుప్స భావం కలిగిన దాఖలా కనిపించలేదు..
మరణం తర్వాత ఖననానికో దహనానికో తప్ప
ఇతరులకేవిధంగానూ పనికి రాని మానవ దేహం కన్నా
కొన్ని సూక్ష్మ ప్రాణులకైనా ఉపయోగపడి వాటి జీవననానికి
తోడ్పడే ఈ హరిణానికి జోతలిడుతూ సెలవుతీసుకున్నాను..
[ఒక ఆంగ్ల కవిత చదివిన నేపధ్యంలో---]
=====================================

No comments:
Post a Comment