ఒక గ్రీష్మర్తువు మిట్ట మధ్యాహ్న సమయాన
==============================రావెల
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
ఊపిరాడని ఊళ్ళన్నీ ఉరేసుకోవడానికి సిద్ధమవుతున్నరోజుల్లో
ఊరిముందర నీరంటూ, చెట్టంటూలేని చెరువుగట్టు మీద
రచ్చచేసే బండలమీద వృధాప్రయాసల చర్చలు మొదలయ్యాయి..
ఎన్నికలంటూలేనిరోజుల్లో పైచొక్కాలకు పనేముందని భుజం మీద పనిలేని
కండువా క్రిందకు దిగొచ్చి గుండెమీదకు నేరుగా పంకాలామారి గాలిని విసరడం ప్రారంభించింది..
వార్తాప్రసారాలపేరిట పెట్టుబడిదారులు ప్రభుత్వం మీద ప్రేమప్రకటించేందుకు
పెట్టుకున్న పత్రికలు వుబుసుపోని పల్లెలకువిసనకర్రలబదులుగూ పత్ర హరితమైన పత్రికలను శుభోదయాత్పూర్వమే పంపిణీనిమొదలుపెట్టి మానసిక కాలుష్యపు కారకాలై
చెరగని తమ ముద్రలు వేస్తూ విషయంలేని విషపు నవ్వులుపూయిస్తున్నాయి.
పగలంతా ఉక్కపోతలతో ఊరేగుతున్న జన ప్రాణాలు
రాత్రయేసరికి పంకాలవైపు పిచ్చిచూపులు...
తాతల కాలమె నయం కరెంటంటూలేకపోయినా
చెట్లంటూ ఉండి కొంతలోకొంతయినా ఊపిరి సలుపుకునే వీలుండేది
ఇప్పుడిలానడమంత్రపు సిరిరోజులు దాపురించాకా ప్రెమాభిమానాలు
అనురాగానుభూతులూ అన్నీ కృత్రిమమఏ అయి పోయి ఆధునికతను
అపహాస్యంచేస్తూ ఆటపట్టిస్తున్నాయ్..తరువుల ఊసేలేని తరంలోకి
జొరబడిపోయి వూపిరంటూ ఆడక ఉక్కిరి బిక్కిరై సతమతమవుతున్నాం..
===========================================================

No comments:
Post a Comment