ఒక మనిషిని మూల్యాకనం చేయడానికి
పట్టుబడని ఓ ముక్కను పట్టుకు వ్రేలాడడం సబబా!!
కావ్య హేతువేనంటూ కరాళ దంష్ట్రాంకురాలతో
చదువరులను అక్షరసహ గాయపరచడం భావ్యమా?
నిర్మాల్యాన్ని నిర్మూలించాలన్న వంకతోనో తలంపుతోనో
అమూల్యమైన అతడు అతి భద్రంగా హృదయ కుహరాల్లో భద్రపరుచుకున్న అతని
మధురాతి మధురమైన జ్ఞాపకాలమూటను కసువుకుప్పలోకి
దయాహీనంగా విసురుగా విసుక్కుంటూ విసరడం ధర్మమా?
కాలనాళికలో కాలకూటవిషాన్ని చొప్పించాలని అంతరంగంలో భావిస్తూ అనవరతం అందుకోసమే అనవసరపు సమాలోచనం గావిస్తూ మతం పేరిట కులంపేరిట కల్మషాల కశ్మలాన్ని
అందులోకి నేర్పుగా మూడోకంటికెరుకలేకుండా ఎక్కించడం విజ్ఞతనిపించుకుంటుందా?
================================================================

No comments:
Post a Comment