పునశ్చరణ
=============
ఆలసించిన ఆశాభంగమయేలావుంది
=============
ఆలసించిన ఆశాభంగమయేలావుంది
మన్నించండి నన్ను నేను ప్రశ్నించుకోవాల్సిన
సమయం చడీ,చప్పుడులేకుందా వస్తుందన్న భయం
నన్ను నిలునా వణికేలా చేస్తున్నది,క్షమించండి.
ఎప్పటికప్పుడు అనుకుంటూనే
అనవసరంగా కాలయాపన చేస్తునట్లున్నాను
మూల్యాంకనం చేసుకునే ప్రక్రియ
ప్రారంభించడం ఇప్పటికయినామేలని
మనసు చెచిదగ్గర రొదపెడుతూనే వుంది.
ప్రారంభించడం ఇప్పటికయినామేలని
మనసు చెచిదగ్గర రొదపెడుతూనే వుంది.
పట్టించుకునే వ్యవధానం లేదని
పునశ్చరణచేసుకునే యోగాన్ని
వాయిదావేస్తూ వస్తున్నాను.
ఇప్పుడిక ఆతరుణం ఆసన్నమయింది
తప్పించుకో జూడడం మహాపరాధమై నిలుస్తుంది.
ఇకపై లాభ నష్టాలను బేరీజువేసుకునే విధానం
దినచర్యగా చేసుకోవాలని గట్టిగా తీర్మానించుకున్నాను.
అంతరంగాన్ని అత్యవసరంగా శుద్ధిచేసుకునే ప్రక్రియా
ఈరోజే ప్రారంభించాలని పరమాత్ముని సాక్షిగా
ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను. మనసారా మన్నించండి.
యేరోజుకారోజు సాగరం తనలో పేరుకుపోయిన కల్మషాన్ని
నురగలుగక్కుతూ బయటకు కక్కేయడం గమనిస్తూనే వున్నంగదా!!
ఎవరు ఈ కాలుష్యానికి కారణమని
అంచనాలువేస్తూ,ప్రణాలికలురచిస్ తూ
కాలయాపనచేసిన దాఖలాలెప్పుడయినా
మీ కంటబడిన జ్ఞాపకముంటే చెప్పండి.
తరూ సమూహాన్ని గమనించారుగా
వసంతంలో వెల్లివిరిసిన హరితపత్రాలను
రంగూ రుచీ వాసనలో వైవిధ్యం వచ్చిచేరిందని
శిశిరం వచ్చేసరికి బరువును దించుకోవాలన్న
తలంపుతో. శీఘ్రంగా వదిలించుకోవడంలో
నిమగ్నమయిన సంఘటనలెన్ని చూడలేదుమనం.
మళ్ళీ ఆ తరుసమూహమే నవనవోన్మేషంగా
కనులకు విందు గావించడం మనకు కొత్తయితే కాదుగా
ఆలస్యం ఇక అమృతంకూడా విషమేనని తెలుసుకున్నాను
నన్ను నేను అంతరంగలోకి తొంగిచూసుకునే ప్రక్రియ ప్రరంభించాలి
వేసుకున్న పేశ్నలకు సరయిన జవాబులు రాబట్తేదాక
సత్యశిధకుడినై సహకరిస్తూ ముమ్న్ముందుకు సాగిపోవాలి.
==================================
No comments:
Post a Comment