కాలానికోవినతిపత్రం
-----------------------------రావెల.
=======================================
కన్నెర్రజేయడం మానుకొమ్మని
కాలాన్నికాళ్ళూచేతులు పట్టుకుని
బ్రతిమాలడమ్మొదలెట్టాను.
ససేవ్మిరా నీముక్తాయింపులకు
లొంగను లెమ్మని లోకానికంతటికీ
వినబదెవిధంగా బిగ్గరగా చెప్పింది.
తగుదునమ్మా అంటూ తరువులన్నీ
నరికేయడంచేసారు.
కర్బనుగాలిపెరిగిపోతున్నదనితెలిసీ
కార్లలోతప్ప కాలు బయటకు
పెట్టడమే మానేసారు.
మూలన పడేసిన సైకిలు
మొరబెట్టుకుంటునేవున్నది
నా వూసుతలచుకోవడమేలేదని
ఎండకు ఎండి వానకు తడిసి
దశాబ్దాలుగా దయాహీనంగా
కాలం వెళ్ళదీస్తూన్నానని
కన్నీటిపర్యంతమై మొరబెట్టుకుంటూనే వున్నది.
నైదిబ్బలున్నాయన్న మాటేమరచిపోయారు.
పచ్చిరొట్తేరువులు పనికి రాకుండాపోయాయి.
వేపనూనె వూసునే మరిచిపోయారు!
యూరియా నత్రజని పొటాష్లంటూనో
రసాయనిక ఎరువులవైపో పరుగులు మొదలెట్టారు.
చెరువులనాక్రమించి నీటికి నిలబడె చోతును
లేకుండా అత్యాశతో ఆక్రమణలను ప్రోత్సహించారు!
ఇంకెందుకు మీపై దయాదాక్షిణ్యాలు ప్రకటించాలి అంటూ
ప్రశ్నల వర్షంతోనన్ను ఉక్కిరి బిక్కిరి చేసి
ఊపిరాడకుండా చేసింది. ఆవిడ ప్రశ్నలకు
సరయిన ప్రత్యుత్తరం మనదగ్గరలేనేలేదని
ఇట్టే గ్రహించగలిగాను.
ఒకవేళ కాలమే కన్నెర్రజేస్తే కాబోయే అనర్ధాలకు అంతేలేదని
అవి అన్నీ కూడా అగణితమౌ సత్యభాషలేనని గ్రహించాను.
రుతువులన్నీ అకారణంగా అడుగుబెట్టి అల్లకల్లోలం సృష్టించడం
ఖాయమని నిర్ణయానికి ఒచ్చాను.
అందుకే కాలాన్ని కన్నెర్రకుండా కాపాడమంటూ ప్రకృతిమాతదగ్గర
చేసిన తప్పులకు మానవాళిని మనసారా క్షమించమని వేడుకుని
వెనుదిరిగి వేగంగా గృహోన్ముఖమై కాళ్ళీడ్చుకుంటూ వచ్చాను.
===============================================

No comments:
Post a Comment