ఒక ప్రయాణానికి వెనుకా ముందూ--
==================================
ప్రయాణమనగానే పెట్తేబేడా సర్దుకుని
హుషారుగా పుట్టింటికి పయనమయే పుత్రికలా కాదు.
లేదా తీర్ధయాత్రలనగానే జనపనార సంచిలో
నాలుగు జతలను కుక్కేసుకుని తులసిమాలతో తయారయే
గంగా భారధీ సమానురాలైన బామ్మలా ఉరుకులు పెట్టడంకూడాకాదు.
ఈ ప్రయాణానికో ప్రత్యేకతవుంది, సిద్ధమయిరాగలవేమో
ఒక్క క్షణం ఆలోచించి మరీ ప్రత్యుత్తరమివ్వు.
ఇది మనవడిబారసాలకో మనుమరాలి అక్షరాభ్యాసానికో
వెండిగ్లాసుతోనో పెద్దబాలశిక్షతోబాటు నాలుగు శతకాలను
బహుమతిగా తీసుకుని బయలుదేరడంకూడాకాదు.
ఇది ఎవ్వరూ ఎప్పుడూ ఎదురుచూడని అతిధి పాత్రతో
జరగబోతున్న ముఖాముఖీ సుమా గుర్తుపెట్టుకో!
వెనుకా ముందూ చూసుకోకుండా సగం తినీ సగంతిన కుండా
వారసులకోసందాచిపెట్టిన ధనరాశులతో కూడా కానేకాదు.
కాకికైనా ఎంగిలిచేత్తో తోలడానికిచ్చగించని లోభిలాకాదు.
పరోపకారమేపరమ ధర్మమని భావించే సత్పురుషులు
భయ భ్రాంతులకు గురికాకుండా పద మని వెంటవెళ్ళడానికిష్టపడే
మృత్యువుతోముఖాముఖీ.. వెనుదిరిగి వెడలకుండా సాగిరాగలవేమో
సమాధానం చెప్పు!! సత్కార్యమనుకుని జీవన సాఫల్య పురస్కారం
అందుకుందువుగాని వెనువెంటనే తరలిరా!!తడుముకునే
ఆలస్యం కా కుండా , తీ రికంటూ లేకుండా తక్షణమే తయారయి రా!!
=============================================

No comments:
Post a Comment