Monday, January 25, 2016

కరచాలనం చేసినప్పుడల్లా
కలిగేభావన నన్నుకలివిడిగా
 కట్టిపడేస్తుంది.
ఎదుటివారిని నమస్కరించినప్పుడల్లా
నా ఎదలోతుల్లో ఒక అనుభూతి సంద్రం
 ప్రవహించినట్లనిపిస్తుంది.

మనుషులను ఆప్యాయంగా
 హత్తుకున్నప్పుడల్లా
మనసు మనసుతో మృదుమధురంగా
సంభాషించినట్లనిపిస్తుంది.

నవ్వుతూ ఎదుటివారిని
పలకరించినప్పుడల్లా
నదీసంగమంలో హాయిగా మునిగితేలినట్లు
తనువంతా పులకరించిపోతుంది.


మనిషికీ మధ్యన మమతలవంతెనలు
ఈ పలకరింపుల  ప్రస్థానం ఏర్పరుస్తుంది.
ఆమని వసంత శోభ అంతటా
విస్తరించుకున్నట్లనిపిస్తుంది.

పూలపరిమళాలు ప్రశమించినట్లు
గులాబీ పూలు గుబాళించినట్లు
చల్లగా మలయమారుతం వీస్తున్నట్లు
గుండెగొంతుకలోంచి ఎంకి పాటలు పాడినట్లు.
==========================

No comments:

Post a Comment