నీవులేకుండానే
నాలో నిరంతరం
నినదిస్తున్నది
నన్ను నిద్రలేమికి
గురిచేస్తున్నది
ఓ ప్రియ భావన.
అది నేటి ప్రణయమా?
రేపటి ప్రళయమా?
==============
ఎక్కడినుంచి
ఊడిపడ్డదో ఈ తవ్వోడ
అంతరాంతరాళాల్లో
గత జ్ఞాపకాలనన్నింటినీ తిరగదోడి
నన్ను అనవరతం
ఆందోళనకు గురిచేసి
ఆక్రందనల పాల్జేస్తున్నది.
నాలో నిరంతరం
నినదిస్తున్నది
నన్ను నిద్రలేమికి
గురిచేస్తున్నది
ఓ ప్రియ భావన.
అది నేటి ప్రణయమా?
రేపటి ప్రళయమా?
==============
ఎక్కడినుంచి
ఊడిపడ్డదో ఈ తవ్వోడ
అంతరాంతరాళాల్లో
గత జ్ఞాపకాలనన్నింటినీ తిరగదోడి
నన్ను అనవరతం
ఆందోళనకు గురిచేసి
ఆక్రందనల పాల్జేస్తున్నది.
---------------------------
మధురాతిమధురమైన స్మృతులనన్నింటినీ
చేదుజ్ఞాపకాలుగా మార్పు చెందించాలని
రాత్రనకా పగలనకా విశేషంగా శ్రమిస్తూ,ఎవరిదో ఒక ఈర్ష్య
ప్రణయపాధోరాశిలో విషపు చుక్కలను వెదజల్లుతున్నది .
మధురాతిమధురమైన స్మృతులనన్నింటినీ
చేదుజ్ఞాపకాలుగా మార్పు చెందించాలని
రాత్రనకా పగలనకా విశేషంగా శ్రమిస్తూ,ఎవరిదో ఒక ఈర్ష్య
ప్రణయపాధోరాశిలో విషపు చుక్కలను వెదజల్లుతున్నది .
No comments:
Post a Comment