Monday, January 25, 2016

ఇప్పుడెందుకో యిలా ఎడమొఖంపెడమొఖంలా
పొరపొచ్చాల పైకప్పుక్రింద ఒకరంటే
మరొకరికి పొడ  నేమాత్రంగిట్టని విధంగా
గీతలుగీసుకుని ఎవరి హద్దుల్లో వారం 
జీవనం సాగిస్తున్నాం?
మనిద్దరిమధ్యన మనమే వెలిగించుకున్న
 ఆశాజ్యోతులను అఖండజ్యోతులుగా భావించుకున్న
తీర్మా నాలెలా  తిరోగమనం దిశగా మరలి వెడలిపోయాయి.
ఉత్సాహాన్ని ఊపిరిగా ఆశలను శ్వాసలుగా ఊహించుకున్న
ఉదాహరనలన్నీఉబుసుపోకకేనని స్పష్టమవుతున్నది.
నాకనుచూపుమేరలో నీవుకనబడకపోవడమే మేలనుకునే
వైరుద్ధ్య తత్వాన్ని జీర్ణింపజేసుకుంటున్నాను.
నా అశ్రు సంద్రంలో నిన్ను నిలువునా ముంచడమే మేలనే
ఘట్టినిర్ణయానికొచ్చేలానువ్వు ప్రవర్తించడం మొదలెట్టావ్!

అప్పట్లో  నీవు వల్లించిన సుప్రభాత సూక్తులన్నీ 
యేదిశకుమారిపోయి అదృశ్యమై ఆ ఆశాఉషస్సుల న్నీ   అంతర్ధానమయాయి? 
మధురానుభూతులన్నీ కటికవిషాన్నెలా
సంతరించుకుని ఇలా క్షోభకు కారణమవుతున్నాయి?
మనమధ్యన గోముగా పెరిగి మనపోషణలో ఎదిగిన సుమ సౌందర్యం
మనకనుచూపుమేరల్లో కనబడని లావణ్య సీమకు లంగరేసివెళ్ళాయి!
ఇకమనం ఇక ఈప్రణయ పాధోరాశినుంచి నిష్క్రమించి
నిరాశానిస్పృహలచేతుల్లో బందీకావలసిందేనా?
==================================

No comments:

Post a Comment