మనసు -మనo-- మౌనం
--------------------------రావెల
నామనసులో ఎందుకో ఇటీవల
మౌనం తిష్ట వేసుకుని కూర్చుంది.
మౌనాన్ని నిష్క్రమింపజేయడమెలాగో
అర్ధమవక నాలో అనూహ్యంగా
ఆందోళన చోటుచేసుకుంటున్నది.
మనసుమీద చిరాకుపడి
ప్రయోజనం శూన్యమని గ్రహించాను.
అది మారాముచేస్తే నేను నిస్త్రాణలో
మునిగిపోవడ ఖాయమని గుర్తెరిగాను.
మూగసైగలకే
పరిమితవాల్సి వస్తుందని తెలుసుకున్నాను.
ఇకలాభంలేదని తెలిసి మౌనాన్ని
సంప్రదించడమేమేలని కలు సుకున్నాను.
అదేమో వ్రతభంగానికి పాలుపడడానికి
విశ్వామిత్రుడి ముoదు మేనకననీ
పరమేశ్వరుని దీక్షను భగ్నం
చేసిన పార్వతీదేవిగా భ్రమపడినట్లుంది
ఎంతగాప్రాధేయపడినా నావైపు
అంగీకార సూచనగా తలత్రిప్పడంకూడాచేయలేదు.
మనసుకూ, మౌనానికీ మధ్య విడరాని బంధమేదైనా
పెనవేసుకుని పోయిందేమోనని అనుమానం కలిగింది.
మనసు మారాము చేసినప్పుడల్లా మౌనాన్నేగదా
వసతిగృహంగా ఎంచుకుని మసలుకునేది
మౌనం దీక్షవహించినప్పుడల్లా
మనసునేగదా నిజగృహంగా తీర్చిదిద్దుకునేది.
మనసు మామధ్య జరుగుతున్న
శబ్దాలసందడికి మౌన వదనయిందిలాగుంది.
మూగనోమును పట్టుకుని వ్రేలాడడం మొదలెట్టింది.
మౌనమేమోదీన్ని గ్రహించి నిశ్శబ్దాన్ని కౌగిలించుకుని
అవ్యాజానురాగాన్ని ప్రకటించడం మొదలెట్టింది.
మనసుని చేతులుపట్టుకుని దీనంగా
బ్రతిమాలుకుందామని
గట్టిగా నిర్ణయించుకున్నాను.
అదేమో పాదరసంకన్నా వేగంగా
పరుగును లంకించుకుని
పారిపోవడం ప్రారంభించింది.
మనసు విశాలమైనదిగా
దూర దృష్టికి కనిపించినా
దగ్గరకు చేరుకోగానే సూక్ష్మ
రూపంలోకి పరకాయప్రవేశం చేసింది.
మనసు మురిపిస్తుంది,మెరిపిస్తుంది
అందనంత ఎత్తులో నింగిలో గిరికీలు
కొట్టడం నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.
ఇకనేను మౌనాన్ని సంప్రదించడమేమేలనుకున్నాను.
మనసును చిత్తగించమని బ్రతిమాలుకున్నాను.
ఇక నాపీడవదిలిందనుకున్నదోయేమో
మౌనం మనసును దాటుకుని బయటకు వచ్చి
తేరిపార జూసింది.
మాటల మరాఠీలా మాట్లాడడం మొదలెట్టింది.
మౌనం నిర్వాకాన్ని గమనించిన మనసు
బుంగమూతిపెట్టుకుని దూరంగా జరిగిపోయింది.
మనసూ , మౌనం ఒకనాణేనికి బొమ్మాబొరుసులని గ్రహించాను.
విడదీసి చూడడం ఎవరివల్లా కాదని ఇట్టే అర్ధమయిపోయింది.
ఒకరి కనుసన్నలలో మరొకరు సంచరిస్తుంటారని
ఆలస్యంగానైనా అర్ధమయినందుకు ఆనందం
నా వశమయిపోయింది ఆశ్చర్యం నాస్వంతమయి నిలుచుంది.
==============================================
--------------------------రావెల
నామనసులో ఎందుకో ఇటీవల
మౌనం తిష్ట వేసుకుని కూర్చుంది.
మౌనాన్ని నిష్క్రమింపజేయడమెలాగో
అర్ధమవక నాలో అనూహ్యంగా
ఆందోళన చోటుచేసుకుంటున్నది.
మనసుమీద చిరాకుపడి
ప్రయోజనం శూన్యమని గ్రహించాను.
అది మారాముచేస్తే నేను నిస్త్రాణలో
మునిగిపోవడ ఖాయమని గుర్తెరిగాను.
మూగసైగలకే
పరిమితవాల్సి వస్తుందని తెలుసుకున్నాను.
ఇకలాభంలేదని తెలిసి మౌనాన్ని
సంప్రదించడమేమేలని కలు సుకున్నాను.
అదేమో వ్రతభంగానికి పాలుపడడానికి
విశ్వామిత్రుడి ముoదు మేనకననీ
పరమేశ్వరుని దీక్షను భగ్నం
చేసిన పార్వతీదేవిగా భ్రమపడినట్లుంది
ఎంతగాప్రాధేయపడినా నావైపు
అంగీకార సూచనగా తలత్రిప్పడంకూడాచేయలేదు.
మనసుకూ, మౌనానికీ మధ్య విడరాని బంధమేదైనా
పెనవేసుకుని పోయిందేమోనని అనుమానం కలిగింది.
మనసు మారాము చేసినప్పుడల్లా మౌనాన్నేగదా
వసతిగృహంగా ఎంచుకుని మసలుకునేది
మౌనం దీక్షవహించినప్పుడల్లా
మనసునేగదా నిజగృహంగా తీర్చిదిద్దుకునేది.
మనసు మామధ్య జరుగుతున్న
శబ్దాలసందడికి మౌన వదనయిందిలాగుంది.
మూగనోమును పట్టుకుని వ్రేలాడడం మొదలెట్టింది.
మౌనమేమోదీన్ని గ్రహించి నిశ్శబ్దాన్ని కౌగిలించుకుని
అవ్యాజానురాగాన్ని ప్రకటించడం మొదలెట్టింది.
మనసుని చేతులుపట్టుకుని దీనంగా
బ్రతిమాలుకుందామని
గట్టిగా నిర్ణయించుకున్నాను.
అదేమో పాదరసంకన్నా వేగంగా
పరుగును లంకించుకుని
పారిపోవడం ప్రారంభించింది.
మనసు విశాలమైనదిగా
దూర దృష్టికి కనిపించినా
దగ్గరకు చేరుకోగానే సూక్ష్మ
రూపంలోకి పరకాయప్రవేశం చేసింది.
మనసు మురిపిస్తుంది,మెరిపిస్తుంది
అందనంత ఎత్తులో నింగిలో గిరికీలు
కొట్టడం నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.
ఇకనేను మౌనాన్ని సంప్రదించడమేమేలనుకున్నాను.
మనసును చిత్తగించమని బ్రతిమాలుకున్నాను.
ఇక నాపీడవదిలిందనుకున్నదోయేమో
మౌనం మనసును దాటుకుని బయటకు వచ్చి
తేరిపార జూసింది.
మాటల మరాఠీలా మాట్లాడడం మొదలెట్టింది.
మౌనం నిర్వాకాన్ని గమనించిన మనసు
బుంగమూతిపెట్టుకుని దూరంగా జరిగిపోయింది.
మనసూ , మౌనం ఒకనాణేనికి బొమ్మాబొరుసులని గ్రహించాను.
విడదీసి చూడడం ఎవరివల్లా కాదని ఇట్టే అర్ధమయిపోయింది.
ఒకరి కనుసన్నలలో మరొకరు సంచరిస్తుంటారని
ఆలస్యంగానైనా అర్ధమయినందుకు ఆనందం
నా వశమయిపోయింది ఆశ్చర్యం నాస్వంతమయి నిలుచుంది.
==============================================
No comments:
Post a Comment