నువ్వున్నావు
నీపాటా ప్రతిధ్వనిస్తూనేవున్నది
ఎవరన్నారు నీతోబాటే
కాలమూ ఆగిపోతుందని?
ప్రతిప్రభాతాన సూర్యోదయం
ప్రతిఉదయాన పూసిన పూలపరిమళం
మావిచిగురుల మాటున దాగిన
కోయిలమ్మ గాన లహరులు
అన్నీ ఆనంద మకరందాలేగదా!!
ఇక నువ్వులేవన్న భావన
నా మనోమందిరంలో
ఎలా ప్రభవిస్తుంది నువ్వేచెప్పు?
నీపాటా ప్రతిధ్వనిస్తూనేవున్నది
ఎవరన్నారు నీతోబాటే
కాలమూ ఆగిపోతుందని?
ప్రతిప్రభాతాన సూర్యోదయం
ప్రతిఉదయాన పూసిన పూలపరిమళం
మావిచిగురుల మాటున దాగిన
కోయిలమ్మ గాన లహరులు
అన్నీ ఆనంద మకరందాలేగదా!!
ఇక నువ్వులేవన్న భావన
నా మనోమందిరంలో
ఎలా ప్రభవిస్తుంది నువ్వేచెప్పు?
No comments:
Post a Comment