దేవుడా నా దేశాన్ని రక్షించు!
===============================
పవిత్ర యుద్ధం పేరున జరుగుతూన్న
మారణహోమపు అగ్ని శిఖలనుంచి.
కులం, మతం పేరున రాజుకుంటున్న
కుంపట్ల సెగలతో వేడెక్కుతున్న పొగల సెగలనుంచి.
ఆవేశకావేషాలతో ఆహుతైపోతున్న
యువతరాన్ని కమ్ముకుంటున్న మంచుజడులనుంచి
బుసలు కొడ్తూ చెలరేగిపోతున్న పన్నగాల
విష పన్నాగాల ప్రణాళికల అంచులనుంచి.
అనుక్షణం ఊపిరులూదుతున్న ఉగ్రవాదమనే
ఉన్మాదాల పేరిట ఉసురు తీస్తున్న ఉచ్చై స్వరం నుంచి
ఇరుగుపొరుగు దేశాలలో పెంచిపోషింపబడుతున్న
అనైక్యతా భావాల విఛ్చిన్నకర ధోరణుల
స్వార్ధం సంకుచితత్వంతో కుచించుకుపోతున్న నేతల
విష ఫూత్కారాలు వెదజల్లే కల్మషాల కశ్మలమై పోతూ
నానాటికి తీసికట్టుగా పరిణమిస్తున్న
వాతావరణపు కాలుష్యపు విపరీతాల నుంచి
కోట్లకు పడగలెత్తి కోటిరకాలుగా ఆర్ధిక పరమైన
అస్థిరతలను ప్రోత్సహిస్తూన్న స్విస్ బ్యాంకు లాకర్లలొ
మూలుగుతూన్న నాగుపాములు నగుమోముతో వెదజల్లుతున్న
నఖ దంతాలు చేస్తున్న గాట్లతో క్షతగాత్రయై
విషణ్ణ వదనంతో విలపిస్తున్న నా నాదేశాన్ని నా భారతమాతను
దేవుడా!! ఇకనైనా దీక్షా కంకణ ధారుడవై దగ్గరుండి కాపాడు!!!

No comments:
Post a Comment