Sunday, January 24, 2016

అశ్రువులన్నింటినీ
అక్షరబద్ధంచేద్దాం.
విషాదాన్ని విశ్వగీతంగా
మార్పుచేందేలా శ్రమిద్దాం.
మీ గుండే గొంతుకలో
నినాదాలుగా వ్రేలాడుతున్న
ఒక్కొక్కటినీ శోకగీతంగా
మరలుద్దాం,తరలిరండి


కులానికి కుచ్చుల పరికిణీలు
ఎంపికచేయడం కాదు ఈక్షణాల్లో,
మతానికి మేకప్ చేసి చూడడం చాలు!!
గుండెకు తగులున్న గునపాలను తొలగించండి.
దయార్ద్రహృదయంతోనో--దాష్టీకం
పురుడు పోసుకుంటుందనో
డబ్బులు వెదజల్లడం కాదు
ఇప్పుడు కావలసింది-------
మమిషిని మనిషిగా గుర్తించి
గౌరవించే మనసులు కావాలిప్పుడు.
అందుకోసం ఆక్రోశాన్నికాదు
ఆవేశాన్నీ కాదు కాదు
ఆంతర్యాన్ని ఆవిష్కరించగలిగితే చాలు
అది అక్షరాలా పదివేలు పదిలక్షలు
పదికోట్లుగా --ప్రవర్ధమానమౌతుంది.
=========================

No comments:

Post a Comment