మరువేసుకోవడంలో నిమగ్నమై----
------------------------------రావెల
^^^^^^^^^^^^^^^^^^^^^^^
ఎప్పటికయినా ఎంతకొద్దిసేపయినా
గుండెకు జ్ఞాపకాలతడిని తనివితీరాఅద్ది
ఒక్కసారైనా మా అనురాగాభిమానాలతో
కౌగిలింతగా హత్తుకోవాలనిఒక వింత కోరిక ఉత్పన్నమయింది.
కోరికపుట్టినదే తడవుగా జ్ఞాపకాల రధమనే
వాహనమెక్కి ఊరేగుతున్నంత ఆనందంగా
అనుభూతి కలిగింది --
జ్ఞాపకాలంటే గతకాలపు వైభవాన్ని
ప్రదర్శించేందుకు వీలుగా
సోదాహరణంగా గుండె గొంతులో భద్రంగా
దాచిపెట్టుకున్న మధుర స్మృతుల ఆనవాళ్ళేగదా
శిశిరంలోసైతం చిగురించగల సత్తాను
హృదయకవాటాల్లో సుతిమెత్తగా , అమూల్యమైనసంపదగా
పాతరలో దాచిపెట్టుకున్న ధాన్య సంపద లాంటిదే గదా!!
జ్ఞాపకాలను పునశ్చరణ చేసుకోవడమంటే
తేనతుట్టెను కదిలించినట్టు అపరాధ భావన
పడాల్సిన అవసరమేంలేదు.
ఉప్పు సంద్రంలొనైనా నీటిని సేకరించి
ఇక్షు రసంలొ ముంచుకుని మనోహరంగా స్వాదుయోగ్యంగా
స్వీకరించడమేగదా!!
జ్ఞాపకాలు మనజీవితాల్లో
పరవళ్ళుతొక్కుతున్నాయంటే
మనం వాటికి కృతజ్ఞతాభావాలను
అత్యవసరంగా ప్రకటించగలగాలి.
భావి జీవితంలో బంగరు బాటలు
వేసుకునేందుకు సహాయ సహకారాలనందించే
నేస్తాలనే మాట మనం మనసుపొరల్లో
భద్రంగా దాచుకోవాలి.
గతంలో జరిగినతప్పిదాలనో పొరబాట్లనో
పరోక్షంగా హృదయఫలకాలపై ప్రదర్శించగల
నైపుణ్యం, వాటిని సరిగ్గా సమయానికి సరిదిద్దుకొమ్మని
సూచనలనందించే సౌహార్దంకూడా వాటికే వునందన్నది సత్యం.
ఇలా వ్యక్తిత్వ వికాసానికి దోహదచేసే ప్రావీణ్యం
మూల్యాంకనం చేసుకోవడంద్వారా మన నడతను
శ్రేయోదాయకంగా పరిణమింపజేసుకునే అవకాశం అందించిన
ఈజ్ఞాపకాల స్రవంతికి శిరసువంచి వినమ్రంగా
ధన్యవాదాలుచెప్పడం యేరాజ్యంగంలోనూ ఉల్లేఖిస్తూ
పొందుపరచబడనిప్రాధమిక హక్కు, మన వేదాల్లోఎక్కడా
ఘోషించబడకపోయినా కనీసంగా ధర్మబద్ధమని
మనం మనసారా గ్రహించవలసిన. న్యాయసహితంగా
నెరవేర్చవలసిన బాధ్యత.
============================================