Tuesday, June 14, 2016

హృదయాంతరగమున మధనంబు వైయక్తికంబు.సుమనోల్లాసమున ఇట్లు జరుగుట కద్దు.అప్రియమని కొందరనుకొన్ననూ ఇది మానవ నైజమునకు కడు సామీప్యమునకు ఏగుదెంచినట్లున్నడి.ఇది సుకృతమేగాని వేరుగాదు.కవిసమ్రాట్టుల ఇతివృత్త వైచిత్రినీ రచనా వైదగ్ధినీ ప్రశంసింపనోర్వని హృదయము హృదయేమే గాదు.పాషాణమై యుండనోపు

Sunday, June 12, 2016

కక్షలూ కావేషాలు
గత కాలపు  చిహ్నాలు
బెదిరిoపుల దీక్షలు నిరసనలూ
ఆధునికతకు దోస్తులు

కులమేగదా ఏనాటికైనా
సంకులసమరానికి ఆజ్యం.

ఒకవేకువవెలుతురు వాకిలి తలుపులు తట్టి నా
కనులకు చీకటి కమ్మిన తెరలే త్వరితగతిన తొలగినా
మనసుకెంత ఆనందవిహారమో
మనిషికెంత మకరంద మాధురీ వైదుష్యమో--

Saturday, June 11, 2016

ఎగసాయం
--------------------రావెల

నీరులేకుండానే సాగుబడా?
అని ప్రశ్నించని కర్షకుడు
కన్నీటిసాయంతో పంటను
పండించాలని శ్రమిస్తాడు.
కృషిలో ఉన్న ఆస్తి కాస్తా
దుర్భిక్షమవుతున్నదనితెలుసుకున్నా
కౌలుకో, పాలికో తలొంచి సాగిపోతున్నాడు.
పంటంటూ చేతికొచ్చాక దళారీలచేతుల్లో
దగాపడిన తమ్ముడిగా
దిగాలుపడుతూ కూర్చున్నాడు..
-------------------------------------------------------------------

Friday, June 10, 2016

ప్రభాత సమయాన
సుస్పష్టంగా నీ నవ్వు
పరిమళ భరితంగా వికసిస్తుంది..

మిట్ట మధ్యాహ్నానికి న్నీ ఆక్రోశం
అలసటను  భుజాలమీదకెత్తుకుని
నడినెత్తినకెక్కి నాట్యమాడుతూ
 తైతక్క లాడుతుంది.




సాయంసమయం సమీపించగానే
నీ సౌమనస్యం మల్లెలా విరబూస్తుంది..

చీకటి చిరునవ్వులను చిందించడం మొదలెడిగానే
నీ అనురాగం పంచ వన్నెల రామచిలుకలా
గారాలుబోతూ అనుభూతిసంద్రమై
 అలలను తనలోకి సంగమించేలా సాయపడుతుంది..
ఒక సంతోషం సంద్రంలా ఎగసిపడుతుంటే
అలల్లా ఎగిరెగిరిపడే భావనలెన్నెన్నో--అసంఖ్యాకం
ఒక సంతాపం మనిషిని కృంగదీస్తుంటే
శిశిరతరువును చూస్తున్న కళ్ళలా చెమర్చని
హృదయకుహరాలింకా ఎన్నెన్నో--అగణితం..
------------------------------------------------------------

Thursday, June 9, 2016

చినుకులు నేలను చిత్తడిచేసినవేళ
-----------------------------------------రావెల

నిన్నటిదాకా నిలువునా ఎండిపోయి
దీనావష్థలో కొట్టుమిట్టాడిన ఈనేల
వరుణదేవుడికరుణతో తలస్నానం చేసింది..

అందమంతా తనకే సొంతమన్నట్లు
సగర్వంతో తలేత్తి నిలుచుంది..
 ఎండ వేడిమికి బితుకు బితుకుమంటున్న
కొమ్మలన్నింటికీ కొత్త సొబగులనద్దడంలో
నిమగ్నమై-- నిట్టూర్పులకు దూరంగా నిట్టనిటారుగా
ఈ తరువు తగుదునమ్మా యన్నట్లు శోభాయమానమై
సుందరతరమైన సొబగులనందిస్తూ సోకులుబోతుంది..



నాలుగు చినుకులు తలమీద పడగానే చిరుదరహాస చంద్రికలు
నల్దిశలకూ బహిర్గతమ్యేలా నడయాడడం మొదలెట్టింది..

పూలచెట్లన్నింటికీ తమ పూర్వవైభవాన్ని సంతరించుకొమ్మని
సెలవిచ్చి వాటి సుమధుర పరిమళాల విజృంభణకు
 చేదోడు వాదోదోడుగా నిలిచి అవి నిభాయించుకునేదాకా
నిజాయితీగా సాయమందించి ఇతోధికంగా సాయమందించి సహకరించింది...

రుతువులెన్ని కలగూరగంపలై కవ్విస్తున్నా అనావృష్టిని
అల్లంత దూరానికి తరిమి కరువు కాటకాలకిక్కడసలు చోటే లేదనే
వానచినుకుల గాంభీర్యమైన ముద్రకు నమస్సుమాంజలులు--