Monday, June 6, 2016

అది చిరకాలంగాపరిచయమైన ముఖమే
అయినా అనునిత్యం నిత్యనూతనమై భాషిస్తుంది..
అది అలవాటైన అలుకనే
అయినా ఎందుకోమరి  అనుక్షణం చిరాకుపుట్టిస్తుంటుంది..
ఆకాశాన్ని అందంగా చిత్రించాలనుకుంటే
నీ కనుబొమ్మలను అరువుగాస్వీకరిస్తాను.

నీవుకోరుకున్న ముత్యాలహారాన్ని ఆదమరువకుండానే

నా ప్రణయకవితలతో అల్లిమరీ అందిస్తాను..

నీవు ప్రేమనే మహాసంద్రంలో ఈదులాడగోరితే
నా అనురాగానుభూతులను రస ధునిలా ప్రవహింపజేస్తాను..

ఆనందనందనవనంలో నీవు స్వైర విహారంచేయదలిస్తే
నా మనోహరమైన విరితోటను నీకు బహుమానంగా అందిస్తాను..

ఇకచాలు!!  నీకోపారుణనేత్రాలను శాంతించమను..
ప్రణయపాదోధిలో పునీతులమై విహంగాల్లా విహరిద్దాం..
------------------------------------------------------

No comments:

Post a Comment