Tuesday, June 7, 2016

వాస్తవాధీనంగా
-----------------------


నిజమే నేననంటున్నది నిజమే సుమా!!
ఆమె ఎప్పుడూ అప్పుడే ముద్రణాలయం నుంచి
బయటాకొచ్చిన కొంగ్రొత్త పుస్తకంలా
సువాసనలను గుబాళిస్తూ వుంటుంది..

ప్రతిపేజీ ఎన్నిమార్లు చదివినా
నిత్యనూతనంగా భాషించినట్లుగా
నవనవలాడుతూ ఇల్లంతా కలయదిరుగుతుంటుంది..

రోజూ తనగాలివీవనిదే ప్రజలకు
ఊపిరాడదేమోనన్నట్లుగా
ఇంటి పెరటిలోని తరువులా కుటుంబానికంతటికీ

నిత్యం శోభాయమానంగా ఎదురుపడుతుంటుంది..
రోజూ పరిమళాలను పంచనిదే ఏమీ పాలుపోదన్నవిధంగా
పూలగుత్తుల్లా కబురులుచెబుతూ కళకళ లాడుతూ
నవ్వుతూ నవ్విస్తూ కళావళను,కలతలను
దూరంగా నెట్టే స్తుంది..

ఆమెను కొత్త పుస్తకమననా?
ప్రాణవాయువులందించే తరువుగాస్వీకరించనా?=============
నవ్వుల విరితోటకు నాణ్యతనందించిన
యజమానురాలిగా అభివర్ణించనా?
 సర్వంతానేయై సంచరించే తనను
సర్వసక్తిసమన్వితగా భావించి
ఇతోధికంగా గౌరవించనా?

ఆమేచిత్రపటం ముందు మోకరిల్లి
భక్తిపురస్సరంగా ప్రణమిల్లనా?

మాసిపోని నా స్మృతిపధంలో
కోహినూరువజ్రమని కీర్తించనా?
===================================

No comments:

Post a Comment