Thursday, June 9, 2016

చినుకులు నేలను చిత్తడిచేసినవేళ
-----------------------------------------రావెల

నిన్నటిదాకా నిలువునా ఎండిపోయి
దీనావష్థలో కొట్టుమిట్టాడిన ఈనేల
వరుణదేవుడికరుణతో తలస్నానం చేసింది..

అందమంతా తనకే సొంతమన్నట్లు
సగర్వంతో తలేత్తి నిలుచుంది..
 ఎండ వేడిమికి బితుకు బితుకుమంటున్న
కొమ్మలన్నింటికీ కొత్త సొబగులనద్దడంలో
నిమగ్నమై-- నిట్టూర్పులకు దూరంగా నిట్టనిటారుగా
ఈ తరువు తగుదునమ్మా యన్నట్లు శోభాయమానమై
సుందరతరమైన సొబగులనందిస్తూ సోకులుబోతుంది..



నాలుగు చినుకులు తలమీద పడగానే చిరుదరహాస చంద్రికలు
నల్దిశలకూ బహిర్గతమ్యేలా నడయాడడం మొదలెట్టింది..

పూలచెట్లన్నింటికీ తమ పూర్వవైభవాన్ని సంతరించుకొమ్మని
సెలవిచ్చి వాటి సుమధుర పరిమళాల విజృంభణకు
 చేదోడు వాదోదోడుగా నిలిచి అవి నిభాయించుకునేదాకా
నిజాయితీగా సాయమందించి ఇతోధికంగా సాయమందించి సహకరించింది...

రుతువులెన్ని కలగూరగంపలై కవ్విస్తున్నా అనావృష్టిని
అల్లంత దూరానికి తరిమి కరువు కాటకాలకిక్కడసలు చోటే లేదనే
వానచినుకుల గాంభీర్యమైన ముద్రకు నమస్సుమాంజలులు--

No comments:

Post a Comment