Wednesday, June 1, 2016

వంశవృక్షం
------------------రావెల
్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్

నన్ను మాట్లాడనివ్వండి
నెత్తీ నోరుతో మొత్తుకుంటున్నాను
నన్ను ఒక్క నిముషంపాటైనా మాట్లాడనివ్వండి..
తరాలకొద్దీ మనుషులకు సహకరిస్తూ
జీవితాన్ని ధారపోసాముమేమని మీరెరుగనిదికాదు..
ఫలితంగా ముసలితనం ముద్దెట్టుకోకముందే
నాతల్లిని పొట్టనబెట్టుకున్నారు..
దారినపోయేవారిని ఆబగా
కావులించుకున్న సౌహార్దం నాది..
మీ సుఖజీవనంకోసం యవ్వనంతో
తృళ్ళుతున్న నా అన్ననూ అక్కనూ తొలగించారు..
ఇప్పుడేమో నయానా,భయానా నన్నుకూడా
మీ స్వార్ధచింతనతో కనుమరుగుచేయాలని చూస్తున్నారు!!
ఇతరులకు సాయపడుతూ వస్తూ వచ్చిన నా వంశవృక్షాన్నే
తెగనరికి సంతసిస్తూపోయారు..ఇవ్వాళ రుతువులకు
భూతలం పై నిలువనీడంటూ లేకుండా పోయిందని మొసలికన్నీరు
కారుస్తూ మొక్కలు నాటుతున్నంలెమ్మని సముదాయించాలని చూస్తున్నారు..
అందివచ్చిన కుటుంబ సభ్యులుపోతే ఎంతబాధో మీకిప్పటికయినా
గుణపాఠం తెలిసొస్తే చాలు అదే పదివేలు...
================================================

No comments:

Post a Comment