హరిత హారం
---------------రావెల
నెర్రెలు విచ్చుకుని
వ్రక్కలై వగచే
నేలతల్లికోసం
ఒక మొక్కయినా నాటలేమా!!
ఆమొక్కకు మొక్కుబడిగానయినా
ఓ చెంబెడునీరు గుమ్మరించలేమా?
ఇష్టంకాకపోయినా
కష్టసాధ్యమేనని గుర్తెరిగినా
పిల్లలను కనడంలోనూ
పెంచిపోషించడంలోనూ అమితంగా
శ్రద్ధవహించి మురిసిపోయే మనం
మన పూర్వీకులను తలుచుకుంటూ
మురిసిపోతూ ముఖాల్లో
మెరుపులకు తావిచ్చే మనం
నిన్నటిదాకా నిలువనీడనిచ్చిన
చెట్లనుకూడా మళ్ళీ పునరుద్ధరించడం
కర్త్యవ్యంగా భావించి ముందుకడుగువేద్దాం రండి
మనిషికొక్క మొక్కను నాటగలిగితే తో 130 కోట్ల మొక్కలకు
దేశంలో జీవంపోసిన వారమవుతాం..
రుతువుల వైమనస్యాన్ని దూరంగా
తరిమివేసిన ఘనతను దక్కించుకుంటాం..
ఇంతకన్నా మంచితరుణం ఇలలోఇంకేముంది?
ఆలసించిన ఆశాభంగము,, ఒక సైన్యంలా కదలిరండి..
హరిత హారాన్ని అమూల్యమైన కానుకగా నేలతల్లికి
సమర్పించడానికి సర్వం సహా సన్నద్ధులు కండి--
============================================

No comments:
Post a Comment